మహేష్, చరణ్, సమంత.. ఈ ముగ్గురూ ఆ సినిమాని కాపాడలేకపోయారు!
on Oct 16, 2024
ఒకప్పుడు ఇండియన్ సినిమాల ఫార్మాట్ వేరు. అప్పటి సినిమాలన్నీ ఒక ఫార్ములాతో రూపొందేవి. ఐదు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్స్.. ఇదీ అప్పటి సినిమాల కంటెంట్. ఈ ఎలిమెంట్స్ ఉంటే చాలు హీరో ఎవరైనా ప్రేక్షకులు చూసేవారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. హీరోలతో పనిలేదు, హీరోయిన్లతో పనిలేదు. కేవలం కంటెంటే సినిమాకి ప్రధానం అనేది ఫిక్స్ అయిపోయింది. ఆడియన్స్ మైండ్‌సెట్ కూడా అలాగే ఉంది. సినిమాలో విషయం ఉంటే స్టార్స్ అవసరం లేదు, కొత్తవారైనా చూస్తాం అంటున్నారు. అలా ఈమధ్యకాలంలో చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కొన్ని సినిమాలు స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దానికి ఉదాహరణగా ఈ దసరాకి రిలీజ్ అయిన ‘జిగ్రా’ సినిమా గురించి చెప్పుకోవచ్చు.
అలియా భట్‌కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘జిగ్రా’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ధర్మ ప్రొడక్షన్స్ బేనర్‌పై కరన్‌జోహర్ రూ.90 కోట్ల బడ్జెట్‌తో ఎంతో గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియాలోని పలు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడంతో అన్ని భాషల్లోని ప్రముఖులతో ఈ సినిమా ప్రమోషన్ చేయించారు. అయితే ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖులతోనే ఎక్కువ పబ్లిసిటీ చేశారు. ఎందుకంటే ఈ సినిమాని తెలుగులో రానా రిలీజ్ చేశారు. రామ్‌చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, మహేష్ సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సమంత, త్రివిక్రమ్ హాజరయ్యారు. ఇలా టాలీవుడ్ సెలబ్రిటీస్ ‘జిగ్రా’ చిత్రానికి హైప్ తెచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. కానీ, లాభం లేకపోయింది.
అక్టోబర్ 11న విడుదలైన ‘జిగ్రా’ చిత్రానికి తొలిరోజు, తొలి షోకే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. దీంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఫస్ట్ డే కూడా థియేటర్స్ ఫుల్ అవ్వలేదంటే సినిమా ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదు రోజుల్లో టోటల్‌గా రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తెలుగులో మూడు రోజుల్లో కేవలం రూ.18 లక్షలు మాత్రమే వసూలు అయింది. ఇంత ఘోరమైన కలెక్షన్స్ చిన్న సినిమాలకు కూడా ఉండవు అన్నది వాస్తవం. టాలీవుడ్ సెలబ్రిటీస్ రామ్‌చరణ్, మహేష్, సమంత, త్రివిక్రమ్ వంటి వారు ప్రమోట్ చేసినప్పటికీ సినిమాని కాపాడలేకపోయారు. ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న టాక్ చూస్తుంటే కలెక్షన్స్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read